ఏంజలినా కొత్త చిత్రం
హాలీవుడ్‌ నటి ఏంజలినా జోలి కొత్తగా నటిస్తున్న చిత్రం ‘దోజ్‌ హు విష్‌ మీ డెడ్‌’. ఈ చిత్రానికి దర్శకుడు టేలర్‌ షెర్డియన్‌. ఈ సినిమా కథకు రచయిత మైకేల్‌ క్యారీ అదే పేరుతో రాసిన నవల ఆధారం. ఈ సినిమాలో ఓ 14 సంవత్సరాల బాలుడు క్రూరంగా హత్యకు గురౌతాడు. కథంతా బాలుడి నేపథ్యం చట్టూనే తిరుగుతుంది. ఇందులో ఏంజలినా పాత్ర ఏమిటనేది ఇంకా తెలియలేదు. ఈ సంవత్సరం మే నెల్లోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకురావడానికి చిత్ర నిర్మాతలు గార్రెట్‌ బాచ్, స్టీవ్‌ జైలియన్‌న్లు సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు ఈ చిత్రాన్ని మే 29, 2020న విడుదల చేయడానికి ముహుర్తం నిర్ణయించారు. ప్రసుత్తం ఏంజలినా ‘మాలిస్ఫియంట్‌2’, ‘కమ్‌ అవే’ అనే చిత్రాల్లోను చేస్తుంది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.