అభిమాని ప్రేమ లేఖకు స్పందన..

ఆకాశంలోనే నక్షత్రాలు ఉన్నట్టు అందమైన అమ్మాయిలంతా చిత్ర పరిశ్రమలో ఉన్నారని ఓ నెటిజన్‌ అభిప్రాయం. రోజూ నక్షత్రాలను చూడగలం కాని దగ్గరికి చేరుకోలేము. అలాగే రోజూ అతను ప్రేమించే తారను చూస్తున్నాడు కాని ఆమె దగ్గరికి చేరుకోలేను కదా అని ట్విట్టర్‌ వేదికగా వాపోయాడు. భూమి ఫెడ్నేకర్‌ మీద ఉన్న ప్రేమను తెలుపుతూ..‘‘ హాయ్‌ బ్యూటిపుల్‌ మ్యామ్, మిమల్ని తలచుకోకుండా, మీ ఫోటో చూడకుండా ఒక్క రోజు కుడా ఉండలేను, మీరు చాలా ముద్దుగా ఉంటారు. మీరు మామూలు అమ్మాయి అయితే బాగుండేది. ఇప్పుడు మీరు పెద్ద సెలబ్రిటీ. మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలీదు. ఈ విషయం తలచుకున్నప్పుడల్లా నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే మీరు నాలాంటి సాధారణ వ్యక్తిని పెళ్లి చేసుకోలేరు కదా’’ అని ట్వీట్‌ చేశాడు. దీన్ని చూసిన భూమి అంతే ప్రేమతో జవాబు చెప్పారు. ‘‘ నేను సెలబ్రిటీ అయినా సాధారణ అమ్మాయినే. అయినా ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే ఆలోచనలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ నువ్వు నన్ను ఎప్పుడూ మిస్‌ అవ్వకుండా చూసుకుంటాను. మంచి సినిమాలతో వెండి తెరపై సందడి చేస్తుంటాను’’ అని ప్రేమగా స్పందించారు. ఈ ట్వీట్‌ని చదువుతూ తెగ సందడి చేస్తున్నారు మిగతా నెటిజన్లు.


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.