అందంలో రాణి ఆమె!

హాలీవుడ్‌ చరిత్రలోనే అతిగొప్ప నటీమణుల్లో ఒకరుగా ఆమె పేరు సుస్థిరం. అందానికి, హుందాతనానికి మారుపేరుగా గుర్తింపు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం ‘మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ద బ్రిటిష్‌ ఎంపైర్‌’ అందుకున్న నటి. ఆమే ఎలిజబెత్‌ టేలర్‌. ప్రపంచ వ్యాప్తంగా గొప్ప సినిమాగా పేరొందిన ‘క్లియోపాత్రా’ సినిమాలో ఈజిప్ట్‌ రాణిగా ఆమె అభినయం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఆ సినిమాకు ఆమె మిలియన్‌ డాలర్ల పారితోషికం అందుకుంది. చిన్నతనం నుంచే వెండితెరకు పరిచయమైన ఎలిజబెత్‌ టేలర్‌, ‘దేరీజ్‌ వన్‌ బోర్న్‌ ఎవ్రీ మినిట్‌’, ‘నేషనల్‌ వెల్వెట్‌’, ‘ఫాదర్‌ ఆఫ్‌ద బ్రైడ్‌’, ‘ఎ ప్లేస్‌ ఇన్‌ ద సన్‌’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు పొందింది. ‘బటర్‌ ఫీల్డ్‌8’ సినిమాతో ఆస్కార్‌ అందుకుంది. టీనేజిలోనే స్టార్‌డమ్‌ అందుకున్న ఎలిజబెత్‌ వ్యక్తిగత జీవితం ఎనిమిది పెళ్లిళ్లతో ముడిపడింది. క్లియోపాత్రాలో సహనటుడు రిచర్డ్‌ బర్టన్‌తో ఆమె సాన్నిహిత్యం తరచు వార్తల్లోకి ఎక్కుతుండేది. అయితే అతడితో ఆమె బంధం 1976 ఆగస్టు 1తో ముగిసింది. ఆమె జీవితం ఎంత వివాదాస్పదమైనా, సామాజిక సేవలో ముందుండి మానవత్వం చాటుకుంది. ఎయిడ్స్‌ పరిశోధన కోసం ఆమె 1991లో ఒక ఫౌండేషన్‌ స్థాపించింది. 2011లో ఆమె మరణించే వరకు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.