హాలీవుడ్ - బాలీవుడ్లో ఇప్పుడు పెళ్లిల్లు వాయిదా వేసుకొంటున్నారు. కారణం ఒక్కటే అదే కరోనా. హాలీవుడ్లో ఆ మధ్య నటి కాటి పెర్రీ - ఓర్లాండో బ్లూమ్ల పెళ్లిని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడే అదేబాటలో తాజాగా నటి ఎమ్మా స్టోన్ కూడా పెళ్లిని వాయిదా వేసుకుంది. ‘స్టాటర్డే నైట్ లైవ్’ రచయిత అయిన డేవ్ మెక్కారీతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఎమ్మా స్టోన్ - డేవ్లు మెక్కారీలు నిశ్చితార్థం చేసుకొని ఉంగరాలు మార్చుకున్నారు. ఈ మార్చిలోనే వారిద్దరూ ఒక్కటవ్వాల్సింది. ఎమ్మా ‘జోంబియలాండ్’ రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ‘క్రేజీ స్టుఫిడ్ లవ్’లాంటి చిత్రాల్లో అలరించింది. ఇక బాలీవుడ్లోనూ వరుణ్ ధావన్ - నటాషా దలాల్, మరోజంట రిచా చద్దా - ఫజల్ అలీల పెళ్లిలు కూడా వాయిదా పడ్డాయి. ఈ వాయిదాలన్నింటికి కారణం ఒక్కటే, కరోనా వైరస్.