అభిమానుల కోసం నగ్నంగా...

ఆంగ్ల చిత్రాలపై ఏమాత్రం అవగాహన ఉన్న ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ అనే అమెరికా టెలివిజన్‌ సీరియల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారత్‌లో కూడా ఇది వెబ్‌ సిరీస్‌ రూపంలో బహు ప్రాచుర్యం పొంది చాలా మంది అభిమానులని సంపాదించుకుంది. పేరుకే వెబ్‌ సిరీస్‌ అయిన భారీ హాలీవుడ్‌ చిత్రాల కాన్నా ఎక్కువ ఆదరణ పొందింది. ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదరు చూసే సినీ ప్రేక్షకులున్నారు. ఇందులో నటించిన నటీనటులకు హాలీవుడ్‌ తారల కంటే రెట్టింపు గుర్తింపు లభించింది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన వారిలో ఎమీలియా క్లార్క్‌ అనే నటి కూడా ఒకరు. ఎమీ ‘ఆర్మ్‌ చైర్‌ ఎక్స్‌పర్ట్‌’ అనే షోలో పాల్గొన్ని ఈ సిరీస్‌లో ఆమె నటించిన నగ్న సన్నివేశాలపై కొన్ని సంచలన వ్యాఖ్యాలు చేసింది. ‘‘తాను ప్రధాన పాత్రలో రూపొందిన సిరీస్‌ విజయవంతం అయినందుకు సంతోషంగా ఉన్నప్పటికి తన చేత బలవంతంగా నగ్న సన్నివేశాల్లో నటింపచేశారన్నారు. అవసరం లేని సన్నివేశాల్లో కూడా నా చేత బట్టలు విప్పించారు. సెట్‌లో ఈ విషయంపై రోజూ నాకు దర్శకుడికి మధ్య గొడవలు జరుగుతుండేవి. దుస్తులు విప్పనని నేను, లేదు ఇక్కడ ఆ అవసరం ఉందని దర్శకుడు వాదించుకునేవాళ్ళం. నేను నగ్న సన్నివేశాల్లో నటించకపోతే ఫ్యాన్స్‌ బాధపడతారని ఆయన వివరణ ఇచ్చేవాడు. దాంతో ఆ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఇబ్బందికరంగా అనిపించేది. ఎందుకంటే అసలు ఆ సన్నివేశాల్లో నటించడానికి బట్టలు విప్పాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ ఎందుకు నా చేత అలా చేయించారో వారికే తెలియాలి. అలాంటి వాతావరణంలో నేను చాలా సార్లు నగ్నంగా నటించాల్సి వచ్చింది. నేను నగ్నంగా నటించాల్సిన అవసరం ఉందో లేదో నాకే తెలీదు కాని ఇలా నటిస్తున్నందు మాత్రం చాలా బాధపడుతున్నాను’’ అని చెప్పింది  ఎమీలియా. ఈ కామెంట్స్‌తో ఆంగ్ల మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారారు ఎమీ.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.