ఉంగరాలు మార్చుకున్న జెన్నీఫర్, అలెక్స్‌

ప్రముఖ పాప్‌గాయని, నటి, నిర్మాత జెన్నీఫర్‌ లోపెజ్, బేస్‌ బాల్‌ ఆటగాడు అలెక్స్‌ రొడ్రిగ్జ్‌ వివాహబంధంతో ఒకటి కానున్నారు. రెండేళ్లుగా ఈ జంట డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. తమకు నిశ్చితార్థం జరిగిన విషయాన్ని వెల్లడించేలా జెన్నీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంగరంతో కూడిన ఓ ఫొటోను పెట్టింది. అందులో అలెక్స్‌ చేయి పైన జెన్నీ ఉంగరం ధరించిన చేయి ఉంది. అలెక్స్‌తో జెన్నీకి 2005లో పరిచయమైంది. అప్పటికే జెన్నీకి వివాహమైంది. ఆ తర్వాత 2011లో జెన్నీ తన భర్త మార్క్‌ ఆంటోనితో విడాకులు తీసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలెక్స్, జెన్నీల పెళ్లి కబుర్లు ఇక తెలియాల్సి ఉంది.

View this post on Instagram

????????????????

A post shared by Jennifer Lopez (@jlo) onCopyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.