కోవిడ్‌ రిలీఫ్ ఫండ్ కోసం నగ్నంగా జెన్నిఫర్

ఇప్పుడు ప్రపంచమంతా కరోనావైరస్‌తో అల్లాడిపోతుంది. ప్రస్తుతం అలాంటి బాధితుల కోసం హాలీవుడ్‌ నటి జెన్నీఫర్‌ ఆనిస్టన్‌ తన నగ్న చిత్రాన్ని వేలానికి పెట్టింది. ఇదే విషయాన్ని జెన్నీఫర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేసింది. అంతేకాదు ఆ ఫోటోను సైతం ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ‘‘నా ప్రియమైన స్నేహితుడు మార్కె సెలిగర్‌, లియెనార్డో డికాప్రియో, ఓప్రా విన్ఫేతో కలిసి 25 మంది ప్రముఖుల ఫోటోలను వేలం వేయనున్నారు. ఈ మొత్తం కోవిడ్‌-19 రిలీఫ్‌ పండ్‌ కోసం. అమ్మకం అయిన మొత్తం 100 శాతం ‘నాఫ్‌క్లినిక్స్’ అనే సంస్థకు వెళ్తుంది. ఇదంతా కరోనా వైరస్‌ పరీక్ష చేయడంతోపాటు బాధితుల సంరక్షణకు కూడా పనిచేస్తుంది.

View this post on Instagram

A post shared by Jennifer Aniston (@jenniferaniston) on

వేలం గురించి తెలుసుకోవాలంటే నా బయోలింక్‌లో లాగిన్‌ అవ్వండని..’’ పేర్కొంది. అయితే జెన్నీఫర్‌ ఆనిస్టన్‌ ఫోటో గురించి అమెరికన్‌ ఫోటోగ్రాఫర్‌ మార్క్ సెలిగర్‌ మాట్లాడుతూ..‘‘నేను తొలిసారిగా ఆమెను కలిసినప్పుడు ఆమె గొప్ప నటి అవుతుందని’’ చెప్పాడు.  ‘బ్రూస్ ఆల్మైటీ’ (2003) చిత్రంతో జెన్నీఫర్‌కి మంచిపేరొచ్చింది. ఇందులో జిమ్‌క్యారీతో కలిసి నటించింది. ఆ తరువాత చాలా చిత్రాల్లో నటించింది. వాటిలో ‘ది గుడ్‌ గర్ల్’, ‘ఫ్రెండ్స్ విత్‌ మనీ’, ‘కేక్’‌లాంటి చిత్రాల్లో నటించింది. హాలీవుడ్‌ హీరో బ్రాడ్‌పిట్‌ని 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకొని 2005లో విడిపోయింది. చాలా కాలం ఒంటిరిగా ఉన్న, ఆ తరువాత మరో నటుడు-దర్శకుడు జస్టీన్‌ థెరాక్స్ ని  2015లో పెళ్లి చేసుకొంది. రెండు సంవత్సరాలు కలిసున్న ఈ జంట 2017లో విడిపోయింది. ప్రస్తుతం జెన్నీఫర్‌ ఆనిస్టన్‌ బుల్లితెరపై సందడి చేస్తుంది. 



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.