జీవితమంటే సోషల్‌ మీడియా కాదు!

‘‘ప్రస్తుతం చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు ప్రతి చిన్న విషయానికి సోషల్‌ మీడియాపైనే ఆధారపడుతున్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు’’ అని చెబుతోంది బాలీవుడ్‌ భామ కరీనాకపూర్‌. ‘‘నాకు తెలిసి ప్రస్తుతం యువత ఎక్కువ మంది చిన్న చిన్న విషయాల్ని బహిరంగా చర్చించుకోవడం చేస్తున్నారు. ఇది సమస్యకు పరిష్కారం కాదు. మాటల కంటే సంక్షిప్త సందేశాలు మనసులను దగ్గర చేయలేవు. సాధ్యమైనంత వరకు స్నేహితులతో కలిసిమెలిసి మాట్లాడండి. వారితో మీ బాధలను పంచుకోండి. అంతేకానీ ప్రతి విషయాన్ని షేర్‌ చూసి వాటిల్లో వచ్చే కామెంట్ల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. నా మటుకు నేను సమయం దొరికితే పుస్తకాలతోనే గడుపుతుంటా. ఇప్పుడున్న యువత చాలామంది తమ సమయాన్ని మొత్తం ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌తోనే కాలం వృధా చేస్తున్నారు. అలా కాకుండా ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి’’ అని చెబుతోంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.