అప్పుడు హృదయం పొంగింది!

ప్రపంచంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే గుండెను హత్తుకుంటాయి. అలాంటి వాటిలో ఒకటి జేమ్స్‌ కామెరాన్‌ దర్శకత్వం వహించిన ‘టైటానిక్‌’ చిత్రం. ఇందులో లియోనార్డో డికాప్రియో, కేట్‌విన్‌స్లెట్‌ నాయికానాయకులుగా నటించారు. తాజాగా ఈ సినిమా గురించి చిత్రనటి కేట్‌ విన్‌స్లెట్‌ మాట్లాడుతూ..‘‘టైటానిక్‌’ చిత్రం ప్రపంచమంతా తిరగేసింది. నేను కొన్ని సంవత్సరాల క్రితం ఇండియాలోని హిమాలయ పర్వత ప్రాంతంలో పర్యటిస్తున్నాను. ఆ సయమంలో ఓ వ్యక్తి నన్ను గుర్తు పట్టి ‘నువ్వ్వు ‘టైటానిక్‌’ కథానాయిక కదూ’’ అంటూ పలకరించాడు. నేను అవును అని చెప్పగానే ఆయన నా గుండె మీద చెయ్యివేసి ధన్యవాదాలు అని చెప్పాడు. దాంతో నాకు కన్నీళ్లు వచ్చాయి. గుండె పులకించి పోయింది. ఇంతకీ ఆయన గురించి మీకు చెప్పలేదు కదా ఆయన వయసు 85 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకు ఒక కన్ను గుడ్డిది కూడా. ఇలా ఎక్కడికి వెళ్లినా గుర్తు పెట్టుకునేటట్టు చేసిన చిత్రం ‘టైటానిక్‌’. అంటూ తను ఇండియాకు వచ్చినప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.