త్వరలోనే హాలీవుడ్‌ నటి ‘కాటి పెర్రీ’ పెళ్లి

హాలీవుడ్‌ గాయని - నటి అయిన కాటి పెర్రీ తన గానంతో సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంది. అదే విధంగా ‘కాటి పెర్రీ: పార్ట్‌ ఆఫ్‌ మి’, ‘బ్రాండ్‌: ఏ సెకండ్‌ కమింగ్‌’లాంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పింది. అలాంటి కాటి పెర్రీ హాలీవుడ్‌ నటుడైన ఓర్లాండో బ్లూమ్‌లు గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఒకరినొకరు విడిచివుండలేని ప్రేమజంట ఏడాది చివర్లో పెళ్లి చేసుకోనున్నారు. మొదట్లో వీరిద్దరి పరిచయం చాలా విచిత్రంగా జరిగిందట. వృత్తుల పరంగా, వ్యక్తిగతంగా అర్థం చేసుకున్న ఈ ప్రేమికులు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల్లో ప్రేమికుల రోజునే ఉంగరాలు మార్చుకొని నిశ్చితార్థం చేసుకొన్నారు. ఆసందర్భంలోని కొన్ని ఫోటోలను ఒర్లాండ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి హంగామా చేశాడు. పెళ్లి చేసుకోవడానికి కొంత సమయం కావాలని అనుకున్నారట. ఇప్పుడు ఆ సమయం దగ్గరపడింది. అందుకే ఓ ఇంటివాళ్లవ్వడానికి తహతహలాడుతున్నాడని హాలీవుడ్‌ సినీ సమాచారం. కాటీ పెర్రికి గతంలోనే హాస్యనటుడు రిస్సెల్‌ బ్రాండ్‌తో 2010లో వివాహమైంది. 2012లో విడిపోయింది. తరువాత జాన్‌ మేయర్‌తో కొన్నాళ్లు డేటింగ్‌ చేసి విడిపోయింది. ఓర్లాండ్‌ కూడా మోడల్‌ మిర్రండా కెర్ర్‌ని 2010లో పెళ్లి చేసుకొని 2013లో విడాకులు ఇచ్చాడు.





Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.