ప్రముఖ హాలీవుడ్ నటి మార్గోట్ రూబీ అనగానే మనకు గుర్తుకొచ్చే చిత్రాలు ‘ది లెంజెడ్ ఆఫ్ టార్జాన్’, ‘సూసైడ్ స్వ్కాడ్’ గుర్తుకొస్తాయి. ఈ ఏడాది ఆరంభంలో ‘బర్డ్స్ ఆఫ్ ప్రే’ చిత్రంలో ప్రధాన పాత్ర షోషించింది. తాజాగా ఈ అమ్మడు ‘పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించనుంది. ఈ సీక్వీల్ కొత్త ప్రాజెక్టు చిత్రం కోసం రచయితలు టెడ్ ఇలియట్, క్రెయిగ్ మాజిన్లు వైవిధ్యంగా ఉండేందుకు కథను రూపుదిద్దే పనిలో ఉన్నారట. ఇది పూర్తిగా డిస్నీల్యాండ్ కథలలోంచి ప్రేరణగా తీసుకొని రూపొందింస్తున్నారట. ‘ఫైరేట్ ఆఫ్ ది కరేబియన్’ సీక్వెల్ చివరి చిత్రంగా వచ్చిన ‘డెడ్ మ్యాన్ టెల్ నో టేల్స్’లో జానీ డెప్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. ఇది మే 26, 2017 విడుదలై ఆకట్టుకుంది. ప్రస్తుతం మార్గోట్ జేమ్స్ గన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది సూసైడ్ స్వ్కాడ్’ చిత్రంలో సైకియాట్రిస్ట్‌గా నటిస్తోంది. డీసీ ఫిల్మ్స్, అట్లాస్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.