మోడల్‌గా మెరిసి... నటిగా మెప్పించి!

అయిదేళ్లకే మోడల్‌గా ఆకట్టుకుంది... పన్నెండేళ్లకల్లా అంతర్జాతీయ పత్రికల ముఖచిత్రంగా అలరించింది... ప్రకటనల రంగంలో మర్చిపోలేని అమ్మాయిగా గుర్తింపు పొందింది... పదమూడేళ్లకే టీవీలో నటించింది... పదిహేనేళ్లకి వెండితెరపై వెలిగింది... పద్దెనిమిదేళ్లకి గాయనిగా తొలి ఆల్బమ్‌ విడుదల చేసింది... -ఇదీ మిల్లా జొవోవిచ్‌ వేగం. ‘టూ మూన్‌ జంక్షన్‌’, ‘రిటర్న్‌ టు ద బ్లూ లగూన్‌’, ‘ద ఫిఫ్త్‌ ఎలిమెంట్‌’, ‘ద మెసెంజర్‌: ద స్టోరీ ఆఫ్‌ జోన్‌ ఆఫ్‌ ఆర్క్‌’, ‘రెసిడెంట్‌ ఈవిల్‌’లాంటి సినిమాల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు పొందింది. రష్యాలో 1975 డిసెంబర్‌ 17న పుట్టిన మిల్లా అయిదేళ్ల వయసులో తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వలస వచ్చింది. తల్లి రష్యాలో నటి. ఆమె ప్రోత్సాహంతోనే వినోద రంగంలో మిల్లా అడుగులు మొదలయ్యాయి. వచ్చిన అవకాశాన్నల్లా చురుకుగా అందుకుంటూ అంచెలంచెలుగా ఎదిగింది అందాల రష్యా భామ మిల్లా.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.