
హాలీవుడ్ అందాల భామ కైరా నైట్లీ నటిస్తున్న చిత్రం మిస్బీహేవియర్. బ్రిటీష్ కామెడీ డ్రామగా వస్తున్న వస్తున్న చిత్రానికి ఫిలిప్పా లోథోర్ప్ దర్శకత్వం. తాజాగా ఈ చిత్రం గురించి..సెక్సీజం గురించి మాట్లాడుతూ..మహిళల లైంగిక ఆబ్జెక్టిఫికేషన్ ఇప్పటికీ ఉంది. తరుచూ కొంతమంది మహిళలు రూపంలో చాలా అందమైనవారు. పురుషుల కంటే ఎక్కువ పారితోషికం తీసుకొనే ఏకైక పరిశ్రమ మోడలింగ్ ఒక్కటే. మీ సానుభూతి ఎక్కడ ఉందో, ఈ సినిమా మీ అభిప్రాయాలను ఎదురు ప్రశ్న వేస్తుందని అనుకుంటున్నా. సినిమా స్ర్కిప్టు నాకు ఎందుకు నచ్చిందంటే మూడు వేర్వేరు కోణాల పరిశీలించవచ్చు. అది ఆడవారి స్వేచ్ఛా కోణం, మరొకటి బాబ్ హోప్ నుంచి, అంతేకాదు ఆ యేడాదిలో పోటీలో పాల్గొన్న వారి దృక్కోణం నుంచి కూడా ఉంది. అంతేకాదు హాస్యం తీవ్రమైన రాజకీయ విషయాలను సైతం పరిష్కరించేందుకు ఉపయోగపడుతందని భావిస్తున్నానని చెప్పింది. మిస్బీహేవియర్ చిత్ర కథేంటంటే 1970లో మిస్ వరల్డ్ పోటీ లండన్‌లో జరిగింది. దీనికి వ్యాఖ్యాతగా నాటి హాస్యనటుడు బాబ్ హోప్ అతిథిగా వచ్చారు. మిస్ వరల్డ్ ప్రపంచంలో అప్పట్లో అత్యధికంగా వీక్షించిన టీవీ షోకి 100మిలియన్లకు పైగా వ్యూస్‌ని కలిగి ఉంది. అయితే అదే సమయంలో అందాల పోటీలకు వ్యతిరేకంగా కొత్తగా ఏర్పడిన మహిళా విముక్తి ఉద్యమం వేదికపైకి వచ్చి అంతరాయం కలిగించారు. దాంతో ఆ మహిళా విముక్తి పోరాట సంఘానికి రాత్రికిరాత్రే పెద్ద ఎత్తున ఖ్యాతితో పాటు ప్రచారం కూడా లభించింది. తిరిగి ఆ మిస్ వరల్డ్ పోటీ ప్రారంభం విజేత ఫలితం కలకలం రేపింది. ఆ విజేత స్వీడిష్ చెందినది కాదు. మిస్ గ్రెనడా అనే అమ్మాయి. మిస్ వరల్డ్ కిరీటం పొందిన తొలి నల్లజాతియురాలు. రెబెక్కా ఫ్రేన్ మిస్బీహేవియర్ చిత్రానికి కథ అందించగా లెఫ్ట్ బ్యాంక్ పిక్చర్స్, బీబీసీ ఫిల్మ్స్, బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నిర్మించాయి. మార్చి 13, 2020న చిత్రం విడుదలైంది. జనవరి 22, 202న పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఈ సినిమా ఇండియాలో విడుదల కానుంది. ఇంకా చిత్రంలో గుగు మ్బాతా-రా, జెస్సీ బక్లీ, కీలీ హావ్స్, ఫిలిస్ లోగాన్, లెస్లీ మాన్విల్లే తదితరులు నటించారు.