మరోసారి నెటిజన్లకు టార్గెట్‌గా మారిన ప్రియా!

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రాకు నటిగానే కాక ఫాషన్‌ గర్ల్‌ గానూ సినీప్రియుల్లో మంచి గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ట్రెండ్‌కు తగ్గట్లుగా స్టైలిష్‌ వస్త్రధారణతో ర్యాంప్‌ షోల్లోనూ పబ్లిక్‌ వేదికలపైనా కనువిందు చేస్తుంటుంది. అయితే ఫ్యాషన్‌ పేరుతో ప్రియా ధరించే దుస్తులు కొన్నిసార్లు శృతిమించినట్లుగా దర్శనమిస్తూ నెట్టింట విమర్శలకు కేంద్ర బిందువులుగా నిలుస్తుంటాయి కూడా. ఆ మధ్య మెట్‌ గాలలాలో థీమ్‌కు తగ్గట్లుగా ఓ వెర్రెత్తించే డ్రెస్‌తో దర్శనమిచ్చి సినీప్రియుల ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. దీనిపై అప్పట్లో నెట్టింట రకరకాల ఫన్నీ మీమ్స్‌ కూడా సందడి చేశాయి. ఇక తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ మ్యాగజైన్‌ కోసం ఫొటో షూట్‌లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇందులో భాగంగా ఆమె రకరకాల దుస్తులు ధరించి ఫొటోలకు ఫోజివ్వగా.. అందరినీ ఆకట్టుకుంది ఆమె చీరలో కనిపించిన విధానమే. లోపల ఎలాంటి బ్లౌజ్‌ ధరించకుండా.. కేవలం చీర మాత్రమే ధరించి హాట్‌ హాట్‌గా ఇచ్చిన ఆమె స్టిల్స్‌ నెట్టింట కుర్రకారుకు సెగలు పుట్టించాయి. ఇక తాజాగా ఈ షూట్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ బయటకు రాగా.. దానిపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ప్రియాంక చీరలో సెక్సీగా డ్యాన్సు చేస్తూ కనిపించింది. ఈ నేపథ్యంలోనే దీనిపై విపరీతమైన ట్రోలింగ్‌ మొదలైంది. ‘‘భారతీయ చీరకు ఇలాంటి ఖర్మ పట్టిందేంటి’’ అని ఒకరు కామెంట్‌ చేస్తే.. ‘‘బ్లౌజ్‌ను ఇంట్లో మర్చిపోయి వచ్చినట్లుంది’’ అని మరొకరన్నారు. ఇక ‘‘చీర కట్టుకున్నట్లు లేదు.. విప్పుతున్నట్లుందని’, ‘వల్గర్‌గా ఉందని’, ‘ప్రియాంక తాగి ఫొటో షూట్‌ చేస్తోందని’.. ఇలా రకరకాలుగా దారుణమైన కామెంట్లతో ప్రియా వీడియోపై నెట్టింట విమర్శల దాడి కొనసాగుతోంది. మొత్తానికి ఈ వ్యవహారం ఎటువైపు సాగుతున్నా.. ప్రపంచవ్యాప్తంగా ‘ఇండియన్‌ శారీ’ హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

View this post on Instagram

A post shared by hot_actress_model (@hot_beauties_actress) on



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.