అప్పుడు చండాలమంది.. ఇప్పుడిలా దొరికిపోయింది!!

ప్రియాంక చోప్రానే వివాదాలను వెనకేసుకోని తిరుగుతుంటుందో.. లేక వివాదాలే ఆమెను వెంటాడుతుంటాయో తెలియదు కానీ, తరచూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల నుంచి విమర్శలు ఎదరుక్కొంటునే ఉంటుంది. తాజాగా ఈ గ్లోబల్ బ్యూటికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట పెను దుమారాన్ని రేపుతోంది. ఇంతకీ అంతగా రచ్చకెక్కాల్సిన అంశం ఆ ఫొటోలో ఎముంది? అంటే.. ప్రియా తన తల్లి మధు చోప్రా, భర్త నిక్‌ జోనాస్‌లతో కలిసి ధూమపానం చేస్తూ దర్శనమిచ్చింది. అయితే ఇదేమి ఇటీవల ఫొటో కాదులేండి. ఇటీవల జులై 18న తన 37వ పుట్టినరోజు సందర్భంగా మియామీ సముద్ర తీరంలో పడవలో జరుపుకున్న బర్త్‌డే వేడుకలోనివి. అయినా సెలబ్రిటీస్‌కు ఇలా పొగతాడం అలావాటే కదా.. ఇందులో తప్పేముంది అని మళ్లీ మరో ప్రశ్న మీ మదిలో తలెత్తవచ్చు. అక్కడికే వస్తున్నాం. ఈ ఫొటోలో గుప్పుగుప్పు మంటు పొగ ఊదేస్తున్న ఈ గ్లోబల్‌ స్టారే గతంలో.. ‘దీపావళి నాడు టపాసులు కాల్చకండి, పర్యావరణానికి హాని కలిగించకండి’ అని నీతులు వల్లించింది. అంతేనా.. మరో సందర్భంలో.. ‘పొగతాగడం చాలా చండాలమైన అలవాటు’ అంటూ ట్వీట్‌ కూడా చేసింది. ఇలా ఇన్ని నీతులు చెప్పిన ఈ ముద్దుగుమ్మే.. ఇప్పుడిలా బహిరంగంగా పొగతాగుతూ నెటిజన్లకు అడ్డంగా దొరికిపోవడంతో ఆమెపై విమర్శల జడివాన మొదలైపోయింది. ‘ఒకరికి నీతులు చెప్పడానికే ముందుంటావా? నవ్వు మాత్రం వాటిని పాటించవా’ అంటూ ప్రియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆమె అప్పట్లో చేసిన ట్వీట్‌ను స్ర్కీన్‌ షాట్‌ తీసి మరీ.. ప్రస్తుతం ప్రియాంక పొగతాగుతున్న ఫొటోతో కలిపి మీమ్స్‌ రూపంలో జోకులు పేలుస్తున్నారు. ‘ఆమె పొగతాగొద్దని చెప్పింది కరెక్టే.. కానీ, ప్రియ తాగుతున్నది రామ్‌దేవ్‌బాబా తయారు చేసిన సిగరెట్‌. కాబట్టి ఆరోగ్యానికి హాని చేయదు’ అని సెటైర్లు వేస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.