ఏం రెచ్చిపోయింది..
View this post on Instagram

A post shared by NP globaldomination (@np_globaldomination) on


గ్లో
బల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి తన హాట్‌ హాట్‌ అందాలతో సోషల్‌ మీడియాను హీటెక్కించింది. 36 ఏళ్ల వయసులోనూ నవతరం కథానాయికలకే కన్ను కుట్టేలో మత్తెక్కించే సోయగాలతో ప్రేక్షకలోకాన్ని తన బుట్టలోకి లాక్కుంటోంది. ఈ భామ ఇటీవలే నిక్‌ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మ ప్రముఖ హాలీవుడ్‌ కమెడియన్‌ జిమ్మీ ఫాలెన్‌ నిర్వహించే టాక్‌ షోకు ముఖ్య అతిథిగా హాజరైంది. ఈ షోలో ప్రియాంక హాట్‌ హాట్‌ డ్రెస్సింగ్‌ స్టైల్‌తో అందరి మతులు పోగొట్టింది. ఫుల్‌ క్లీవేజ్‌ షోతో కుర్రకారుకు కనుల విందును అందించింది. ప్రస్తుతం ఈ షోకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇలా ఎద అందాలను ఆరబోస్తూ ప్రియా రెచ్చిపోయిన తీరు పట్ల నెట్టింట్లో ట్రోలింగ్‌ కూడా అదే స్థాయిలో మొదలైంది. ఈ షోలో పీసీ చాలా సార్లు తన డ్రెస్‌ను సర్దుకుంటూ కనిపించడంతో.. ‘ఇంత ఇబ్బందికరంగా డ్రెస్‌ వేసుకోవాల్సిన అవసరం ఏంటి.. దాన్ని సర్దుకుంటూ అవస్థలు పడటం ఎందుకు’ అని నెటిజన్లు విమర్శలు గుప్పించారు.


* ఆ ఫొటో తీసింది ఎవరంటే..
ప్రియాంక తన భర్త నిక్‌ జోనాస్‌ ఒళ్లో పడుకొని నిద్రిస్తున్న ఓ ఫొటో ఇటీవల నెట్టింట్లో తెగ సందడి చేసిన సంగతి తెలిసిందే. ‘బెడ్‌ రూమ్‌లో కూడా కెమెరామెన్‌ను పెట్టుకున్నారా’ అంటూ నెటిజన్లు ఆ ఫొటోను ట్రోల్‌ చేశారు. తాజాగా ఈ ఫొటో వెనుకున్న కథను జిమ్మీ ఫాలెన్‌ షోలో బయటపెట్టింది. ‘‘ఆ పిక్‌ తీసే సమయంలో నేను నిద్రిస్తున్నా. నిక్‌ టీవీ చూస్తున్నాడు. మా కజిన్‌ ఆ ఫొటోను తీసింది’’ అని వెల్లడించింది.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.