మూడో పెళ్లి చేసుకున్న హాలీవుడ్‌ నటి స్కార్లెట్‌ జోహన్సన్

ప్రముఖ హాలీవుడ్‌ నటి స్కార్లెట్‌ జోహన్సన్‌ పెళ్లి చేసుకొంది. హాలీవుడ్‌ హాస్యనటుడైన కోలిన్‌ జోస్ట్ ని వారాంతంలో ఆత్మీయ వేడుకల్లో వివాహం చేసుకొన్నారు. గత మూడేళ్లుగా డేటింగ్‌లో ఉన్న వీళ్లు మేనెల 2019లో నిశ్చితార్థం చేసుకొన్నారు. కరోనావైరస్ మహమ్మారి సమయంలో వృద్ధులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్న మీల్స్ ఆన్ వీల్స్ అనే స్వచ్ఛంద సంస్థ గురువారం ఈ వివాహ వార్తను ప్రకటించింది. కోవిడ్‌ 19 భద్రతా జాగ్రత్తలను అనుసరించి స్కార్లెట్‌ జోహన్స్ న్‌ వారాంతరంలో కుటుంబ సభ్యులు, బంధు-మిత్రుల కొద్ది సమక్షంలోనే ఇద్దరొక్కటయ్యారు. ఈ విషయాన్ని చెప్పడానికి మాకెంతో ఆనందంగా ఉందంటూ మీల్స్ ఆన్‌ వీల్స్ అమెరికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. అంతేకాదు ఈ జంట కష్టసమయంలో బలహీనమైన వృద్దులకు విరాళం ఇవ్వమని ప్రేక్షకాభిమానులను కోరింది. నటి జోహన్స్ న్‌ ప్రతినిధి విషయాన్ని తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యధిక పారితోషిక తీసుకున్న నటీమణుల్లో స్కార్లెట్‌ ఒకరు. ‘అవెంజర్స్‌’ సిరీస్‌లో బ్లాక్‌ విడో పాత్రతో గుర్తింపు తెచ్చుకుంది స్కార్లెట్‌. ‘అవెంజర్స్‌’ ద్వారా ఆమెకు భారీ పారితోషికం అందుతోంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న వంద మంది సెలబ్రిటీలతో ఫోర్బ్స్‌ విడుదల చేసే జాబితాలోనూ ఎన్నోసార్లు చోటు దక్కించుకుంది స్కార్లెట్‌. 2006, 2014, 15, 18, 19 సంవత్సరాల్లో ఆమె పేరు ఆ జాబితాలో ఉంది. స్కార్లెట్‌ జోహన్సన్‌ నటిస్తున్న చిత్రం ‘బ్లాక్‌ విడో’. మే 1, 2020న చిత్రం విడదుల కావాల్సింది. స్కార్లెట్‌కి ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకొంది. వారిలో హాలీవుడ్ నటుడు ర్యాన్‌ రేనాల్డ్స్ , మరొకరు ఫ్రెంచి వ్యాపారవేత్త రోమైన్‌ డౌరియాక్‌ని చేసుకొంది. స్కార్లెట్‌కి ఒక కుమార్తె కూడా ఉంది. ఇప్పుడు కోలిన్‌కి ఇది మొదటి పెళ్లి కాగా స్కార్లెట్‌కి ఇది ముచ్చటగా మూడో పెళ్లి.


View this post on Instagram

A post shared by Meals on Wheels America (@mealsonwheelsamerica) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.