పెళ్లి ప్రణాళికల్లో స్కార్లెట్ జోహన్సన్‌


శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న నటి స్కార్లెట్‌ జొహాన్సన్‌. ‘గర్ల్‌ విత్‌ పెర్ల్‌ ఇయర్‌రింగ్‌’, ‘మ్యాచ్‌ పాయింట్‌’, ‘ద ప్రెస్టీజ్‌’ లాంటి ఎన్నో సినిమాల ద్వారా అందచందాలతో అభినయంతో మెప్పించింది. స్కార్లెట్‌ హాలీవుడ్ నటుడు కోలిన్‌ జోస్ట్ తో 2017నుంచి డేటింగ్‌ ఉంది. గత ఏడాది మేనెల్లో వీరిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనేది చాలా పెద్ద సమస్యగా మారిందట. ప్రస్తుతం కోవిడ్‌-19తో ప్రపంచమంతా ఇబ్బంది పడుతోంది. ఇలాంటి సమయంలో పెళ్లి ప్రణాళికలు గురించి ఆలోచన చేస్తున్నారట. నటుడు కోలిన్‌ మాట్లాడుతూ..‘‘ఇలాంటి సమయంలో చట్టబద్దంగా ఏమీ అనుమతులు ఇస్తారో మాకు తెలియదు. పెళ్లంటే ఇంటిపెద్దలు, బంధువులు అందరు ఒకచోట చేరి సమూహాంగా వారిమధ్య ఆనందంగా ఒక్కటవ్వడమే. కానీ ఇలాంటి సమయంలో పెద్దలను ఇలా గుంపుల్లో పెట్టి వేడుకలు చేసుకోలేం. వృద్దుల క్షేమమే మాకు ముఖ్యం..’’అంటున్నారు. అంటే పెళ్లి వాయిదా పడ్డేట్టేనని చెప్పుకుంటున్నారు. ఇక స్కార్లెట్‌,  మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ‘బ్లాక్‌ విడో’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. కేట్‌ షార్ట్‌లాండ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్కార్లెట్‌ జోహన్స్‌సన్‌ బ్లాక్‌ విడో పాత్రలో కనిపించనుంది. అన్ని అనుకూలంగా ఉంటే ఇండియాలో ఏప్రిల్‌ 30, 2020న విడుదల కావల్సింది. ప్రస్తుతం ఈ చిత్రం నవంబర్‌ 26, 2020కి వాయిదా పడింది. స్కార్లెట్‌ ఫోర్బ్స్ పత్రికకు ఎంపికైంది. హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్టార్‌ హోదాతో పాటు ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా, ఎన్నో ఛారిటీ సంస్థలకు భారీ విరాళాల ఇచ్చిన నేపథ్యం ఉంది.

View this post on Instagram

A post shared by JOSTSSON🥰|| Scarlett and Colin (@colin_scarlett.jostsson) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.