ఏడు దశాబ్దాల నటనా ప్రస్థానం

ఎప్పటికప్పుడు కొత్తవారితో సినిమాలు తీసే హాలీవుడ్‌లో 70 ఏళ్ల పాటు నటిగా కొనసాగడం అంటే అరుదైన విషయమే. అది మార్లీన్‌ డీట్రిచ్‌ విషయంలో జరిగింది. గాయనిగా, నటిగా ప్రాచుర్యం పొందిన ఆమె, ప్రతి దశలోను తనను తాను కొత్తగా ఆవిష్కరించుకోవడమే ఇందుకు కారణం. నాటక రంగం, మూకీల కాలం నుంచి ఆమె అందం, అభినయం కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘ద బ్లూ ఏంజెల్‌’ (1930) సినిమాలో లోలాలోలా పాత్రలో నటన ఆమెకు అంతర్జాతీయ ప్రాచుర్యాన్ని తెచ్చిపెట్టింది. ‘మొరోకో’, ‘షాంగై ఎక్స్‌ప్రెస్‌’, ‘డిజైర్‌’, ‘విట్‌నెస్‌ ఫర్‌ ద ప్రాసిక్యూషన్‌’లాంటి సినిమాల్లో ఆమె అందాల తారగా మెప్పించింది. హాలీవుడ్‌లోని మేటి నటీమణుల్లో ఒకరిగా ఆమె గుర్తింపు పొందింది. బెర్లిన్‌లో 1901 డిసెంబర్‌ 27న పుట్టిన ఈ అసాధారణ నటి, 1992 మే 6న ప్యారిస్‌లో తన 90వ ఏట మరణించింది.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.