తల్లైయిన ప్రియాంక చోప్రా తోడికోడలు సోఫీ

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా ఇప్పుడు చిన్నమ్మ అయ్యింది. తన భర్త నిక్‌ జోనాస్‌ సోదరుడైన జో జోనాస్‌ - సోఫీ టర్నలు సోమవారం ఓ బిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు. బుల్లితెరపై వచ్చిన ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్’  సీరీస్‌లో సన్సా స్టార్క్ పాత్రలో నటించింది సోఫీ టర్నర్‌. సోఫీ టర్నర్‌ - జో జోనాస్‌ అక్టోబర్‌ 2017లో నిశ్చితార్థం చేసుకున్నారు. 2019లో గాయకుడు జో జోనాస్‌ని పెళ్లి చేసుకుంది. 2020 కొత్త సంవత్సరంలో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపింది. తమకు బిడ్డ పుట్టబోతున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించారు సోఫీ దంపతులు. ఆమె చివరిసారిగా సైమన్‌ బెర్గ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎక్స్ మెన్‌: డార్క్ ఫోనిక్స్    చిత్రంలో జీన్‌ గ్రే పాత్రలో నటించి అలరించింది. ఇందులో తన జో జోనాస్‌తో పాటు అతని సోదరులు నిక్‌, కెవిన్‌ జోనాస్‌లు కూడా నటించారు. ప్రస్తుతం తమ అందాల పాపకు విల్లా అనే పేరు కూడా పెట్టారు. మొత్తం మీద ప్రియాంక చోప్రా తోడికోడలు అమ్మవ్వడంతో ఇక ప్రియాంక ఎప్పుడు అమ్మౌతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.