టేలర్‌ స్విప్ట్‌దే అగ్రస్థానం

ప్రముఖ పాప్‌సింగర్, హాలీవుడ్‌ నటి, నిర్మాత టేలర్‌ స్విప్ట్‌ గురించి తెలియనివారుండరు. ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా టేలర్‌ కోసం వెతికారట. 2020కి గాను అత్యధికంగా గురించి గూగుల్‌లో శోధనలో టేలర్‌ అగ్రస్థానం సంపాదించింది. ఈ మధ్యనే జరిగిన అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఇంటర్న్‌ట్‌లో అంతర్జాతీయంగా ప్రముఖ రంగాలకు చెందిన మహిళల గురించి గూగుల్‌లో అందరికంటే ఎక్కువగా సంగీత రంగానికి చెందిన టేలర్‌ స్విప్ట్‌ కోసమే వెతికారట. ఆ తరువాత ప్రముఖ టెన్నిస్‌ క్రిడాకారిణి సెరీనా విలియమ్స్‌ గురించి శోధించారట. ఆ తరువాత అంతర్జాతీయ హాస్యనటి ఆక్వాఫీనా కోసం వెతికారట. ఇక ప్రముఖ నవలా రచయిత అయినా టోని మొర్రిసన్‌ కోసం పరిశోధించారట. 2020కి గూగుల్‌ పరిశోధనలో టేలర్‌ స్విప్ట్‌దే అగ్రస్థానం. టేలర్‌ ఈ ఏడాది వెబ్‌సీరీస్‌లో నటించిన చిత్రం ‘మిస్‌ అమెరికాన’. జనవరిలో విడుదలైన ఈ సినిమా పలువురి నుంచి ప్రశంసలు అందుకుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.