కోలుకుంటున్న హాలీవుడ్‌ జంట!

హాలీవుడ్‌ మెగాస్టార్‌ టామ్‌ హ్యాంక్స్, ఆయన సతీమణి రచయిత, గాయకురాలు రీటా విల్సన్‌ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ వార్త చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ జంట కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో ఓ ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డులో ఉంటున్నారు. వాళ్లు ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్టు వాళ్ల కుమారుడు చెట్‌ తెలిపాడు. ‘అమ్మానాన్న క్రమంగా కోలుకుంటున్నారు. ఇంతకు ముందు ఉన్నదాని కంటే వారు చాలా మెరుగ్గా ఉన్నారు. కానీ ఇప్పటికీ వైరస్‌ ఎవరికీ సోకకూడదని స్వీయ నిర్భందంలోనే ఉన్నారు. బయటకు రావడం లేదు’ అంటూ చెప్పుకొచ్చాడాయన. హ్యాంక్స్‌ నటించిన ‘ఫారెస్ట్‌ గంప్‌’ చిత్రాన్ని ‘లాల్‌ సింగ్‌ చద్దా’ పేరుతో ఆమీర్‌ ఖాన్‌ హిందీలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.