1 మిలియన్‌ డాలర్లు విరాళం ఇచ్చిన ఆర్నాల్డ్‌

‘టెర్మినేటర్‌’, ‘ది లాస్ట్‌ డే’లాంటి చిత్రాల్లో అలరించిన హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ స్వార్జ్‌నెగర్‌. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌. ఆర్నాల్డ్‌ స్వార్జెనెగర్‌ తనవంతు బాధ్యతగా 1 మిలియన్‌ డాలర్లను విరాళం ఇచ్చాడు. ఫ్రంట్‌లైన్‌ రెస్పాండర్స్‌ ఫండ్‌కి ఈ విరాళాన్ని అందజేశారు. ఈ విరాళం ఫండ్‌-స్కూల్‌ ఆల్‌-స్టార్స్‌ ఫౌండేషన్‌ యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాలోని వివిధ నగరాల్లో ఆహరం, కిరాణ సరుకులను పంపిణీ చేయడం ద్వారా ప్రజలకు సహాయం చేస్తుంది. ఇలా తనకు సమాజం ఏమి ఇచ్చిందో అదే విధంగా తిరిగి మనం సమాజానికి ఎంతోకొంత సాయం చేయాలని ఆర్నాల్డ్‌ అనుకున్నాడట. ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ..‘‘ఆసుపత్రుల్లోని నిజమైన హీరోలను రక్షించడానికి ఇది ఒక వేదిక. ఈ ఫ్రంట్‌లైన్‌లో భాగమైనందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. మీరు కూడా ముందుకు వచ్చి అందరూ సహకరిస్తారని అనుకుంటున్నా’’ అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్నాల్డ్‌ డేవిడ్‌ శాన్‌బర్గ్‌ దర్శకత్వంలో ‘కుంగ్‌ ఫ్యూరీ 2’ అనే చిత్రం చేస్తున్నారు. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బీ-రీల్‌ ఫిల్మ్స్, ఏజెంట్స్‌ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

View this post on Instagram

A post shared by Arnold Schwarzenegger (@schwarzenegger) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.