కొత్త టెర్మినేటర్


టెర్మినేటర్‌’ సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు ఆర్నాల్డ్‌ స్క్వార్జ్‌నెగర్‌. 71 ఏళ్ల వయసులో ఇప్పుడు మరోసారి ఆయన టెర్మినేటర్‌గా
కనిపించబోతుండటం విశేషం. టెర్మినేటర్‌ సిరీస్‌లో ఆరో చిత్రంగా ‘టెర్మినేటర్‌: డార్క్‌ ఫేట్‌’ తెరకెక్కుతోంది. అందులో ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు ఆర్నాల్డ్‌ వెల్లడించారు. ‘డెడ్‌పూల్‌’ దర్శకుడు టిమ్‌ మిల్లర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ దర్శక నిర్మాత జేమ్స్‌ కేమరూన్‌ నిర్మిస్తున్నారు. 1991లో వచ్చిన ‘టెర్మినేటర్‌ 2: జడ్జిమెంట్‌ డే’కు డైరెక్ట్‌ సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. అక్టోబరులో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.