ప్రపంచ అందగాడు!

‘వరల్డ్ మోస్ట్‌ ఎట్రాక్టివ్‌ మ్యాన్‌’ అనే గుర్తింపు తెచ్చుకున్న నటుడు అతడు. అతడి వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తల్లో నానుతూనే ఉంటుంది. అతడే నటుడిగా, నిర్మాతగా హాలీవుడ్‌లో ఆస్కార్‌ అవార్డు సాధించిన బ్రాడ్‌పిట్‌. ఓక్లహోమాలో 1963లో పుట్టిన బ్రాడ్‌పిట్‌ సినిమాలపై ఆసక్తితో నటనలో శిక్షణ తీసుకుని వెండితెర ప్రవేశం చేశాడు. ‘థెల్మా అండ్‌ లౌసీ’ (1991)తో తెరంగేట్రం చేసిన ఇతడు, ‘ఎ రివర్‌ రన్స్‌ థ్రూ ఇట్‌’, ‘లెజెండ్స్‌ ఆఫ్‌ ద ఫాల్‌’, ‘ఇంటర్వ్యూ విత్‌ ద వాంపైర్‌’, ‘సెవెన్‌’, ‘12 మంకీస్‌’, ‘ఫైట్‌ క్లబ్‌’, ‘ఓషన్స్‌ ఎలెవన్‌’ సినిమాలు, ‘ట్రాయ్‌’, ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ స్మిత్‌’లాంటి సినిమాల ద్వారా ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. నిర్మాతగా ‘ద డిపార్టెడ్‌’, ‘12 ఇయర్స్‌ స్లేవ్‌’ లాంటి ఉత్తమ ఆస్కార్‌ చిత్రాలను రూపొందించాడు. నటి జెన్నిఫర్‌ అనిస్టన్‌ను వివాహమాడి ఐదేళ్లకు విడాకులిచ్చిన బ్రాడ్‌పిట్‌ మరో నటి ఏంజెలినీ జోలీని పెళ్లాడాడు. వీరిద్దరి విడాకుల కేసు పెండింగ్‌లో ఉంది.


Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.