ఐశ్వర్యతో కలిసి నటించాలనుకున్నా: బ్రాడ్‌పిట్‌

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు బ్రాడ్‌పిట్‌ సినిమాలంటే ఎవరికైనా ఇష్టమే. ఆయన నటించిన ఎన్నో చిత్రాలు అంతర్జాతీయంగా పేరొందాయి. గతంలో ఓ ముఖాముఖిలో బ్రాడ్‌పిట్‌ మాట్లాడుతూ..‘‘ఐశ్వర్వరాయ్‌తో కలిసి నటించాలని నాకెంతో ఆశగా ఉండేది. ఎందుకంటే ఆమె బాలీవుడ్‌లోని ప్రముఖ నటీమణుల్లో ఒకరు. మేం 2004లో ‘ట్రాయ్‌’ సినిమా చేస్తున్నప్పుడు బ్రైసిన్‌ పాత్రలో నటించమని అడిగాం. కానీ ఐశ్వర్య ఆ పాత్రను వద్దనుకుంది. లేకంటే అప్పుడే ఆమెతో కలిసి పనిచేసే అదృష్టం దక్కేది. కానీ ఆ పాత్రకు హాలీవుడ్‌ నటి రోజ్‌ బైర్న్ ఎంపిక అయ్యింది. బాలీవుడ్‌ చిత్రాల్లో పనిచేయాలని ఇష్టపడుతున్నా. మంచి నృత్యతారల నేపథ్యంలో వచ్చేతారలతోనే నటించానుకుంటున్నా..’’అంటూ చెప్పారు. ఐశ్వర్యరాయ్‌,  ప్రియాంక చోప్రా- దీపికా పదుకొణెకు ముందే హాలీవుడ్‌ చిత్రాల్లో నటించింది. ‘పింక్‌ పాంథర్2’, ‘బ్రైడ్ అండ్‌ ప్రీజుడీస్’‌, ‘ప్రోవోక్డ్’ లాంటి చిత్రాల్లో మెరిసింది. బ్రాడ్‌పిట్‌ గత ఏడాది ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్’ చిత్రంలో నటించి ఉత్తమ సహాయనటుడిగా అకాడమీ అవార్డు సాధించారు. ఏంజెలీనా జోలీతో విడిపోయాక ప్రస్తుతం అలియా షాకత్‌తో కలిసి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. వీటిపై ఆమె స్పందిస్తూ..‘‘హాలీవుడ్ స్టార్ బ్రాడ్ పిట్‌తో కేవలం స్నేహితుడు మాత్రమే..’’ అని చెప్పింది. ప్రస్తుతం ‘బ్లోండ్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆండ్రూ డొమినిక్ దర్శకత్వం వహించబోయే ఈ చిత్రం జాయిస్ కరోల్ ఓట్స్ రాసిన నవల ఆధారంగా అదే పేరుతో తెరకెక్కుతోంది. Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.