‘స్టార్‌ వార్స్‌’లో క్రిస్‌ హెమ్స్‌వర్త్‌

‘థోర్‌: లవ్‌ అండ్‌ థండర్‌’ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న ఆస్ట్రేలియా నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ ‘స్టార వార్స్‌’ చిత్రంలో నటించనున్నాడు. ‘అవెంజెర్స్‌: ఎండ్‌గేమ్‌’ చిత్రంలో ప్రధాన పాత్రలో అలరించిన హెమ్స్‌ ప్రస్తుతం ‘స్టార్‌వార్స్‌’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ‘స్టార్‌వార్స్‌’లో నటించడానికి ఈమధ్య క్రిస్‌ ఎవాన్స్‌ కూడా ఆసక్తి చూపించారు. వీరిద్దరూ కలసి 2018లో వచ్చిన ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’ చిత్రంలో కలిసి పనిచేశారు. మొత్తం మీద ‘స్టార్‌వార్స్‌’లోకి ‘ఎవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ నటుడు చేరుతున్నాడనే వార్తతో ఆ సినిమాకి అంచనాలు పెరిగాయి. హెమ్స్‌ ప్రస్తుతం ‘థోర్‌: లవ్‌ అండ్‌ థండర్‌’ చిత్రంలో కీలక పాత్రయిన థోర్‌గా నటిస్తున్నారు. ఇందులో కథానాయికలుగా నటాలీ ఫోర్ట్‌మన్, టెస్సా థామ్స్‌సన్‌లు నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్‌ 5, 2021న తెరపైకి రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.