తండ్రి అయిన హాలీవుడ్‌ నటుడు క్రిస్ పాట్‌

ప్రముఖ హాలీవుడ్ నటుడు క్రిస్‌ పాట్‌ ఓ ఆడబిడ్డకు తండ్రి అయ్యారు. ఆయన భార్య కేథరిన్‌ స్వార్జెనెగర్‌ అమ్మాయికి జన్మనిచ్చింది. ఇదే విషయాన్ని కేథరిన్‌ తన ట్విట్టర్లో వెల్లడిస్తూ..మాకు అమ్మాయి పుట్టినందుకు సంతోషంగా ఉంది. పేరు లైలా. ఈ విషయాన్ని తెలియజేసినందుకు మాకెంతో సంతోషంగా ఉంది అంటూ పేర్కొంది. ఇక క్రిస్‌ ప్రాట్‌ కూడా స్పందిస్తూ..తల్లి బిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. మేం దేవుడు. మా కుటుంబాలు, మనం ఇష్టపడే వారి ముందు మేం భార్యాభర్తలుగా మారాం. ప్రస్తుతం తల్లితండ్రులం అయ్యాం. ఇది చాలా ఉద్యేగభరితమైన క్షణం. మా జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. మా కుటుంబానికి మాతో పాటు మాకు అండగా నిలబడిన స్నేహితులందరికి కృతజ్ఞతలు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. క్రిస్ ప్రాట్, కేథరిన్‌ స్క్వార్జెనెగర్ జూన్ 2019లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం క్రిస్‌ ప్రాట్‌ జురాసిక్‌ వరల్డ్: డొమినియన్‌ చిత్రంలో నటిస్తున్నారు. చిత్రం వచ్చే ఏడాది జూన్‌ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిస్‌ మకై దర్శకత్వంలో ది టుమారో వార్‌ చిత్రంలోనూ కథానాయకుడిగా నటిస్తున్నారు. స్కైడ్యాన్స్ మీడియా, పాంథాన్‌ ఫోర్ ఫిల్స్మ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో కథానాయికగా వైవోన్నే స్ట్రాహోవ్స్కినటిస్తోంది.

View this post on Instagram

A post shared by chris pratt (@prattprattpratt) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.