కరోనా నుంచి కోలుకున్న ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ క్రిస్టోఫర్‌

ప్రముఖ వెండితెర-బుల్లితెర నటుడు క్రిస్టోఫర్‌ హివ్జు అనగానే చాలామందికి గుర్తొచ్చేంది హెచ్‌బీఓ సీరీస్‌లో వస్తున్న ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’. అందులో టోర్మండ్‌ జెయింట్‌బేన్‌ పాత్రలో క్రిస్టోఫర్‌ నటన అందరికి గుర్తే. దాదాపు నెలరోజుల క్రితం కరోనా వైరస్‌ టెస్ట్‌ చేయగా క్రిస్టోఫర్‌కి పాజిటీవ్‌గా తేలింది. దాంతో ఆయన కొన్నాళ్ల పాటు స్వీయ నిర్భందంలోకి వెళ్లిపోయాడు. ఇప్పుడు మరోసారి అతను కోరనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఇప్పుడు అదే విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పాడు. ‘‘నేను నా భార్య పూర్తిగా ఈ వ్యాధి నుంచి బయటపడ్డాం. ప్రస్తుతం మంచి ఆరోగ్యంతోనే ఉన్నాం. కోవిడ్‌-19 లక్షణాల చాలా తక్కువ ఉండం మా అదృష్టం. ఇప్పుడు మా ఆలోచనలను అందరితో పంచుకుంటున్నాం. దయచేసి మీరు అందరూ దూరాన్ని పాటించి జాగ్రత్తగా ఉండండి. అన్నింటికంటే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవడం మరచిపోకండి. ఈ సమయంలో ప్రేమతో మెలగండి’’ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. భారతీయ సంతతికి చెందిన హాలవుడ్‌ దర్శకుడు మనోజ్‌నైట్‌ శ్యామలన్‌ దర్శకత్వం వహించిన ‘అప్టర్‌ ఎర్త్‌’ చిత్రంలో భద్రతాధికారిగా నటించాడు. ప్రస్తుతం బుల్లితెరపై ‘డక్‌ టేల్స్‌’, ‘ది విశ్చర్‌’లాంటి సీరీస్‌లో నటిస్తున్నాడు.



View this post on Instagram

A post shared by Kristofer Hivju (@khivju) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.