చిరస్మరణీయ చిత్రం!


మన గాంధీ... మన జాతిపిత... కానీ ఆయన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించింది మాత్రం ఇంగ్లిష్‌ దర్శక నిర్మాత రిచర్డ్‌ అటెన్‌బరో! ఆంగ్లేయుల పాలనపై అహింసాయుత పోరాటం చేసి భారత దేశ స్వాతంత్య్రానికి మార్గం చూపిన గాంధీ జీవితంపై ఒక ఆంగ్లేయుడే అద్భుతమైన సినిమా తీయడం విశేషం. ఓ అద్భుత వాస్తవిక దృశ్యకావ్యంగా రూపొందిన ‘గాంధీ’ సినిమా 1982లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. గాంధీజీని 1893లో సౌత్‌ ఆఫ్రికా రైల్లోంచి బలవంతంగా దించేసిన సంఘటన నుంచి, 1948లో ఆయన హత్యకు గురవడం వరకు ఆయన జీవితంలోని కీలకమైన ఘట్టాలను ఆవిష్కరించిన ఈ సినిమా డిసెంబర్‌ 3న యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో, డిసెంబర్‌ 10న అమెరికాలో విడుదలై విజయం సాధించింది. పదకొండు ఆస్కార్‌ అవార్డులను నామినేషన్లు పొంది, 8 ఆస్కార్‌ అవార్డులు గెలుచుకుంది. ఇందులో గాంధీ పాత్రలో నటించిన బెన్‌కింగ్‌స్లేకి ఉత్తమ నటుడి అవార్డు లభించింది. 22 మిలియన్‌ డాలర్లతో తీసిన ఈ సినిమా 127 మిలియన్‌ డాలర్లకు పైగా ఆర్జించింది. ఈ సినిమా కన్నా ముందు 1952 నుంచే రెండు సార్లు గాంధీ జీవితాన్ని తెరకెక్కించాలనే ప్రయత్నాలు జరిగినా అవి సఫలం కాలేదు.

సంబంధిత వ్యాసాలు


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.