లేట్‌ వయసులో ప్రేమలోపడ్డ

టైటానిక్‌ హీరోప్రముఖ హాలీవుడ్‌ లియోనార్డో డికాప్రియో టైటానిక్‌ సినిమాతో అంతర్జాతీయంగా పేరు సంపాదించాడు. ప్రస్తుతం తన కంటే వయసులో చిన్నదైన నటి కామిలా మొర్రోన్‌తో డేటింగ్‌లో ఉన్నారని వార్తలొస్తున్నాయి. ఈ వార్తకు ఊతమిస్తూ ఈ ఇద్దరు కలిసి ఓ హోటల్లో ఓ హోటల్లో కలిసి బస చేశారు. అందకు సంబంధించిన వీడియా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తుంది. కామిలాతో కలిసి డిన్నర్‌ చేస్తున్న సమయంలో లియోర్డో ముఖం కనిపించకుండా బేస్‌ బాల్‌ టోపీ, నల్లని కోటు ధరించారు. అయినా అంతగా బయటకు ముఖం కనిపించకుండా ఉండేందుకు లియోనార్డో ఎందుకు ఆరాటపడుతున్నాడో తెలియడం లేదని హాలీవుడ్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అన్నట్టు డికాప్రియో వయసు 45 సంవత్సరాలు కాగా, కామిలా వయసు 22 ఏళ్లే. మొత్తం మీద ప్రేమకు వయసుతో సంబంధం లేదని ఈ ఇద్దరిని చూస్తే అర్థమవుతోందని పలువురు సినీ జనాలు అనుకుంటున్నారు. లియానార్డో ఈ ఏడాది వన్స్ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ హాలవుడ్‌ చిత్రంలో రిక్‌ డాల్టన్‌ పాత్రలో కనపించి అలరించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.