ప్రియాంక శ్రీవారు... కొత్త కబురు చెప్పేశారు
ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ బిజీగా గడుపుతోంది. ఇప్పుడు ఆమె భర్త, హాలీవుడ్‌ నటుడు నిక్‌ జొనాస్‌ కూడా తన కొత్త చిత్రం కబురు చెప్పేశారు. 2017లో వచ్చిన ‘జుమాంజి: వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’కు సీక్వెల్‌గా తెరకెక్కనున్న చిత్రంలో నటించబోతున్నట్లు తెలిపారు నిక్‌. జుమాజి అనే వీడియో గేమ్‌ ఆడే నలుగురు టీనేజ్‌ కుర్రాళ్లు అనుకోకుండా అందులోని పాత్రధారుల్లా మారిపోయి అడవిలో చిక్కుకునే కథాంశంతో సాహసోపేత చిత్రంగా ‘జుమాంచ్కీజిజి’ తెరకెక్కింది. అందులో డ్వేన్‌ జాన్సన్, కెవిన్‌ హార్ట్, జాక్‌ బ్లాక్‌ లాంటి ప్రముఖ నటులతో పాటు నిక్‌ కూడా నటించారు. అలెక్స్‌ అనే కుర్రాడిగా కనిపించి మెప్పించారు నిక్‌. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైంది. సుమారు 960 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించనున్నారు. తొలి ‘జుమాంజి’ని తెరకెక్కించిన జేక్‌ కాస్డన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఈ రెండో ‘జుమాంజి’లోనూ నిక్‌తో సహా ప్రధాన పాత్రధారులంతా మళ్లీ అవే పాత్రల్లో కనిపించనున్నారు. ‘‘జుమాంచ్కీజిజి’ సీక్వెల్‌ రాబోతోంది. అందులో మళ్లీ అలెక్స్‌ పాత్రను పోషించడానికి ఆతృతతో ఎదురుచూస్తున్నాన’’ని తెలిపారు నిక్‌. డిసెంబరు 13న ఈ చిత్నాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.