కొరియన్‌ చిత్రంలో సల్మాన్‌
                             

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ కొరియన్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఇదేంటి ఏ హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తాడనుకొంటే కొరియా చిత్రంలో నటించడం ఏమిటి అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే! దక్షియా కొరియాకు చెందిన ‘వెట్రన్‌’ అనే చిత్రం హిందీలో రీమేక్‌గా రానుంది. ఈ చిత్రంలో సల్మాన్‌ నటిస్తున్నారు. ఈ రీమేక్‌ చిత్ర హక్కుల్ని, కొరియన్‌ ప్రొడక్షన్స్, సిజె ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ అధినేత అతుల్‌ అగ్నిహోత్రి దక్కించుకున్నాడు. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సమాచారం అధికారికంగా వెల్లడి కావాల్సిఉంది. ‘వెట్రన్‌’ దక్షియా కొరియా సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా పేరు తెచ్చుకుంది. కొరియాలో ఈ చిత్రానికి రైయో-సెంగ్‌-వాన్‌ దర్శకత్వంలో హవాంగ్‌-జంగ్‌-మిన్, యో హ-ఇన్‌ హీరోలుగా నటించారు. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ ‘భారత్‌’ అనే చిత్రంలో ఇండియన్‌ నావీ అధికారిగా నటిస్తున్నారు. ఈ ఇంకా సినిమాలో దిశ పటానీ, కత్రీనాకైఫ్, జాకీష్రాఫ్‌ తదితరులు నటిస్తున్నారు. కొరియన్‌ చిత్రాల్లో నటించడం సల్మాన్‌ కొత్తేమి కాదు. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో వస్తున్న ‘భారత్‌’ చిత్రం, కొరియాలో విజయవంతమైన ‘ఒదే తో మై ఫాదర్‌’ స్ఫూర్తి.

Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.