బొమ్మలకు ప్రాణం వస్తే?

పిల్లలు ఆడుకునే బొమ్మలకు ప్రాణం వస్తే? అవి మనుషుల్లాగా మాట్లాడుకుంటే? నేను గొప్పంటే నేను గొప్పని వాదించుకుంటే? చివరికి అన్నీ కలిసి తారతమ్యాలు మరిచిపోయి సాహసాలు చేస్తే? ఈ ఊహలకు రూపమే ‘టాయ్‌స్టోరీ’ సినిమాలు. వీటిలో తొలి సినిమా 1995లో విడుదలైంది. అది విజయవంతమవడంతో 1999, 2010ల్లో దానికి సీక్వెల్స్‌ వచ్చాయి. ఈ మూడూ కలిసి 320 మిలియన్‌ డాలర్ల పెట్టుబడికి, ఏకంగా 1.9 బిలియన్‌ డాలర్లను వసూలు చేసి సంచలనం సృష్టించాయి. వీటిలో మూడోది 2010లో ఇదే రోజు విడుదలై అంతకు ముందు సినిమాల కంటే ఎక్కువగా అలరించింది. దీని నిర్మాణానికి 200 మిలియన్‌ డాలర్లయితే, ఇదొక్కటే 1.067 బిలియన్‌ డాలర్లు వసూలు చేయడం విశేషం. రెండు ఆస్కార్లు కూడా అందుకుంది. ఈ సినిమాల పరంపరలో నాలుగోది 2019 జూన్‌ 21న విడుదల కానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.