బాలీవుడ్ యువ కథానాయకుడు వరుణ్ ధావన్ మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రానికి సహాయ దర్శకుడిగా అడుగుపెట్టి ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు. ఆ తరువాత సోలో హీరోగా తన తండ్రి దర్శకత్వంలో వచ్చిన మెయిన్ తేరా హీరోలో శ్రీనాథ్ ప్రసాద్‌గా అలరించారు. అక్కడ నుంచి వరుస చిత్రాలతో బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేతను చాటుకున్నాడు. తాజాగా యువ కథానాయకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 30 మిలియన్లపైగా అనుసరణగణాన్ని సంపాదించాడు. ఈ సందర్భంగా వరుణ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన గత చిత్రాలైన 'స్ట్రీట్ డాన్సర్ 3 డి', 'జుడ్వా 2', 'మెయిన్ తేరా హీరో', 'దిల్వాలే' ఇంకొన్ని చిత్రాలను కలిపి ఒకే వీడియోగా చేసి షేర్ చేశాడు. అంతేకాదు ఆ వీడియోకి..‘‘30 మిలియన్లు + నన్ను నమ్మిందుకు ధన్యవాదాలు’’ అంటూ వ్యాఖ్యానించాడు. వరుణ్ నటనతో పాటు గాయకుడిగా ‘హంప్టీ శర్మ కి దుల్హానియా’లో లక్కీ టు లక్కీ మి’ అనే పాట పాడారు. 2018లో వచ్చిన ‘సూయిదాగా’ చిత్రానికి ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. గత ఏడాది అభిషేక్ వర్మన్ దర్శకత్వంలో వచ్చిన కళంక్ చిత్రంలో నటించారు. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన స్ట్రీట్ డ్యాన్సర్ చిత్రంలో ప్రభుదేవా, శ్రద్ధా కపూర్లతో కలిసి సందడి చేశారు. ప్రస్తుతం సారా అలీఖాన్‌తో కలిసి కూలీ.నెం.1 చిత్రంలో నటిస్తున్నాడు. 1995లో గోవింద, కరిష్మా కపూర్ నటించిన చిత్రానికి ఇది రీమేక్. వరుణ్ ధావన్ తన చిన్ననాటి స్నేహితురాలు నటషా దలాల్‌ను పెళ్లి చేసుకోనున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి వరుణ్ - నటషాలు ప్రేమించుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సంవత్సరం డిసెంబర్లోనే వరుణ్ - నటషాలు ఒకటి కానున్నారని చెప్పుకుంటున్నారు.