సైన్స్ ఫిక్షన్‌ 65 చిత్రంలో నటించనున్న ఆడమ్‌ డ్రైవర్‌

మిడ్‌నైట్‌ స్పెషల్‌, మ్యారేజీ స్టోరీ, స్టార్‌ వార్స్: ది రైజ్‌ ఆఫ్ స్కైవాకర్‌లాంటి చిత్రాల్లో అలరించిన హాలీవుడ్ నటుడు ఆడమ్‌ డ్రైవర్‌. ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంగా తెరకెక్కనున్న 65లో ప్రధాన పాత్రలో నటించనున్నారు. స్కాట్‌ బెక్‌, బ్రయాన్‌ వుడ్స్ సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు. సోనీ పిక్చర్‌ పతాకంపై నిర్మితమౌతోన్న ఈ సినిమాకి సామ్‌ రైమి, జైనాబ్‌ అజీజ్‌, డెబ్బీ లైబ్లింగ్‌లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఆడమ్‌ ఒపియాయిడ్‌ అనే మత్తుకు బానిసగా నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో అతని కంటే భిన్నమైన భాషలు మాట్లాడే 9 సంవత్సరాల అమ్మాయితో పాటు ప్రమాదం పడతారు. ఆ తరువాత వారిద్దరు కలిసి తమ మనుగడ కోసం ఏం చేశారన్నదే మిగిలిన కథ. ఆడమ్‌ డ్రైవర్ ప్రస్తుతం రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో ది లాస్ట్ డ్యూయల్ చిత్రంలో జాక్వెస్ లే గ్రిస్ అనే పాత్రలో నటిస్తున్నారు. సినిమా కోవిడ్ -19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. చిత్రం ఈ మధ్యే మళ్లీ ప్రారంభమైంది. లియోస్ కారాక్స్ దర్శకత్వంలో ‘అన్నెట్‌లోనూ నటిస్తున్నారు. మరి 65 చిత్రం ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇంకా తెలియదు. మ్యారేజ్ స్టోరీ ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ అవార్డు పొందింది. ఆడమ్‌ డ్రైవర్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చింది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.