మానవాళి కోసం ‘యాడ్‌ అస్ట్రా’ ఏం చేసింది?

జేమ్స్‌ గ్రే దర్శకత్వంలో బ్రాడ్‌పిట్‌ నటిస్తున్న చిత్రం ‘యాడ్‌ అస్ట్రా’. ఇందులో బ్రాడ్‌ అంతరిక్ష యాత్రికుడి పాత్రలో చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్లో బ్రాడ్‌పిట్‌ అంతరిక్ష నౌకను బాగుచేస్తుంటాడు. అంతలో నౌక భాగం పైచోట పేలుతుంది. చూస్తుండగానే బ్రాడ్‌ జారిపడి కిందపడిపోతుంటారు. తీరా లేచి చూసే సరికి హాస్పిటల్‌ చికిత్స పొందుతుంటారు. అంతరిక్ష కేంద్రంగా సాగే ఈ కథలో అస్ట్రోనాట్‌ రాయ్‌ మాక్‌బ్రైడ్‌ పాత్రలో బ్రాడ్‌ వేరే గ్రహానికి వెళ్లి తప్పిపోయిన తన తండ్రి గురించి ఆరాధిస్తుంటాడు. ఇంతలో మన భూమికి కీడు చేసే కొన్ని రహాస్యాలను కొనుగొంటాడు. మానవజాతిని కాపాడటం కోసం అతను ఏం చేశాడన్నది మిగిలిన కథ. చిత్రంలో డొనాల్డ్‌ సౌతర్‌ల్యాండ్, జామై కెన్నడీ పీటర్‌ బెల్లో పాత్రలో నటించగా, టామీ లీ జోన్స్‌ క్లిఫర్డ్‌ మాక్‌బ్రైడ్‌ పాత్రలో అంటే బ్రాడ్‌ పాత్రలో నటించగా, లివ్‌ టైలర్, లిసాగే హమిల్టన్, జాన్‌ ఒర్టిజ్‌లు తదితర నటీనటులు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ట్వింటీత్‌ సెంచరీ ఫాక్స్, బోనా ఫిల్మ్‌ గ్రూప్, ప్లానెట్‌ బి ఎంటర్‌టైన్‌ కలిసి నిర్మిస్తున్న చిత్రానికి బ్రాడ్‌పిట్, డేడే గార్డినర్, ఆంటోని కాటగస్‌ నిర్మాతలుగా వ్యవహిరిస్తున్నారు. వాల్ట్‌ డిస్నీ స్టూడియోస్, మోషన్‌ పిక్చర్స్‌ పంపిణి దారులుగా వ్యవరిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 20, 2019న ప్రేక్షకుల ముందుకురానుంది.
        
Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.