‘అవతార్‌ 3’ సైతం 95 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది : జేమ్స్ కామెరాన్‌

సినిమా అంటే అదోరకమైన ఉత్సాహం. మన ఊహకు అందని కథలెన్నో తెరపైకి వచ్చి సంతోష పెడుతుంటాయి. అలాంటి ఊహాతీమైన కథలను తెరకెక్కించే దర్శకుడు జేమ్స్ కామెరూన్‌. ప్రస్తుతం ‘అవతార్‌ 2’ చిత్రం షూటింగ్‌ని పూర్తి చేశారు. తాజాగా ఈ సినిమా గురించి కాలిఫోర్నియా మాజీ గవర్నర్‌ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్‌తో జెమ్స్ కామెరూన్‌ వీడియోలో మాట్లాడుతూ..‘‘ప్రపంచంలోని అన్ని రంగాలను ఇబ్బంది పెట్టినట్లు కోవిడ్‌ 19 మమ్మలి కూడా ఇబ్బందికి గురిచేసింది. సుమారు నాలుగు నెలలకు పైగా విలువైన సమయాన్ని కోల్పోయాం. మేము 'అవతార్ 2' సినిమా షూటింగ్‌ 100 శాతం పూర్తి చేశాం. అలాగే 'అవతార్ 3 సైతం 95% పూర్తి చేశాం. ఇప్పుడు నేను చిత్రాన్ని పూర్తి చేయడానికి ఇంకో సంవత్సరం ఉందని అర్థం కాదు. ఎందుకంటే అవతార్‌ 2ని పంపిణీ చేసిన తరువాత రోజు నుంచే అవతార్‌ 3ని ప్రారంభిస్తాం. ప్రస్తుతం న్యూజిలాండ్‌ సినిమా షూటింగ్‌లో ఉన్నాం’’ అని తెలిపారు. ‘అవతార్ 2’ సీక్వెల్లో జేమ్స్ కామెరాన్ సిగౌర్నీ వీవర్‌తో కలిసి నీటి అడుగున పోరాట సన్నివేశాలను చాలా కష్టపడి తెరకెక్కించారు. సైన్స్ ఫిక్షన్ చిత్రం 'అవతార్' తెరపైకి వచ్చిన చాలా సంవత్సరాల తరువాత ఈ సీక్వెల్‌ చిత్రాలు వస్తున్నాయి. సీక్వెల్‌ చిత్రాల విడుదల తేదీలను ఇప్పటికే ప్రకటితమైయ్యాయి. వాటిలో 'అవతార్ 2' డిసెంబర్ 16, 2022, 'అవతార్ 3, డిసెంబర్ 20, 2024, ‘అవతార్’‌ నాలుగో చిత్రం డిసెంబర్‌ 18, 2026, ఇక ఐదవ చిత్రం డిసెంబర్ 22, 2028న వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.