స‌ముద్రంలో.. అవ‌తార్ 2

ప్రపంచ సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో అవతార్‌ సిరీస్‌ ముఖ్యమైనవి. ఇందులో అవతార్‌-2 చిత్ర షూటింగ్‌ ఇటీవలే ప్రారంభమైంది. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్‌ పండారా గ్రహం నేపథ్యంలో సాగితే.. అవతార్‌-2 సముద్ర అంతర్భాగం నేపథ్యంగా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించి సముద్ర జలాల్లో జరుగుతున్న యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణకు సంబంధించిన ఫొటోలను ఇటీవల ఆ చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న సిగోర్ని వీవర్‌ వెట్‌సూట్‌లో ఉండగా... మోషన్‌ క్యాప్చర్‌ విధానంలో చేస్తున్న షూటింగ్‌ దృశ్యాలను విడుదల చేశారు. షూటింగ్‌ వేగంగా జరుగుతోందని పేర్కొన్నారు. 2021 డిసెంబరులో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా మహమ్మారి దెబ్బకు 2022కు వాయిదా పడిన సంగతి తెలిసిందే.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.