వచ్చే వారంలోనే న్యూజిలాండ్‌లో ‘అవతార్ 2’ షూటింగ్ ప్రారంభం!


ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘అవతార్ 2’. కరోనా వైరస్‌ కారణంగా సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం వచ్చే వారంలోనే తిరిగి షూటింగ్‌ని న్యూజిలాండ్‌లో మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని సెట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాత జోన్‌ లాండౌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలను షేర్‌ చేశాడు. ‘‘నేను మా చిత్ర బృందం (అవతార్‌ 2) న్యూజిలాండ్ వెళ్లడానికి మరింత ఉత్సాహంగా, సిద్ధంగా ఉన్నాం. మీరు మాటాడోర్‌, హైస్పీడ్‌ ఫార్వర్డ్ కమాండ్‌ నౌక, పికాడోర్‌ జెట్‌ బోట్‌ను చూడొచ్చు. ఈ ఫోటోలు మీకు చూపించకుండా ఉండలేకపోతున్నాను..’’ అంటూ పేర్కొన్నాడు. జేమ్స్ కామెరాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో సామ్‌ వర్తింగ్‌టన్‌, క్లిఫ్‌ కర్టిస్‌, జో సల్దానా తదితరులు నటిస్తున్నారు. వచ్చే ఏడాది డిసెంబర్‌ 17న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ‘అవతార్‌’ సీక్వెల్‌గా రానున్న చిత్రాలకు వరుసగా డిసెంబర్‌ నెల్లోనే 2023, 2025, 2027లో విడుదల చేయడానికి షెడ్యూల్ సిద్ధం చేశారు. 2009 తరువాత వస్తున్న ‘అవతార్‌2’ చిత్రాన్ని ట్వింటీత్‌ సెంచరీ స్టూడియోస్‌, లైట్‌స్ట్రోమ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో జేక్‌ సల్లీగా సామ్‌ వర్తింగ్‌స్టన్‌, నైత్రిగా జోయ్‌ సల్దానా, టోనవారిగా క్లిప్‌ కర్టిస్‌లు నటిస్తున్నారు. అంతేకాదు భారతీయ సంతతికి చెందిన దిలీప్‌.రావు శాస్త్రవేత్త డాక్టర్‌ మ్యాక్స్ పటేల్‌గా నటిస్తున్నారు.

View this post on Instagram

A post shared by Jon Landau (@jonplandau) on



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.