వచ్చే ఏడాది డిసెంబర్‌లోనే ‘అవతార్‌ 2’ విడుదల!

అంతర్జాతీయ దర్శకుడు జేమ్స్‌ కామెరాన్‌ దర్శక,నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అవతార్‌ 2’. గతంలో వచ్చిన ‘అవతార్‌’ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్‌. ప్రస్తుతం కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) కారణంగా సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. ఈ సందర్భంగా జేమ్స్‌ కామెరాన్‌ ఓ మీడియాతో మాట్లాడుతూ..‘‘మేం ఈ సినిమాని లాక్‌డౌన్‌ కంటే ముందుగానే న్యూజిలాండ్‌లో షూటింగ్‌ చేయడానికి సిద్ధమైయ్యాం. కానీ ఈ వైరస్‌తో ఆలస్యమైంది. అయితే త్వరలోనే న్యూజిలాండ్‌లో షూటింగ్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. కానీ అక్కడ పరిస్థితలు కొంచెం భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వైరస్‌ని పూర్తిగా నిర్మూలించడం కష్టం. కానీ వైరస్‌ని నియంత్రిచడానికి అక్కడి ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య కాలంలో సినిమా వాయిదా పడటంతో పనులు ఆలస్యమైనా. కొన్ని చిత్రంలో మరికొన్ని అంశాల్లో ఈ సయమం మంచి అవకాశంగాను ఉపయోగపడింది. ఇప్పుడున్న డిజిటల్‌ యుగంలో కొన్ని పనులను ఇంటి దగ్గర నుంచే పూర్తి చేశాం. చాలా వరకు అందరూ బాగానే పనిచేశారు. కొన్ని పనులను మిగతావారిలా పనిచేయలేకపోయాను. ఎట్టి పరిస్థితుల్లోను మేము డిసెంబర్‌ 17, 2021 ‘అవతార్‌ 2’ను విడుదల చేసేందుకు పూర్తి సన్నద్దతో ఉన్నామని’’ చెప్పారు. ఇందులో సామ్‌ వర్థింగ్‌ష్టన్, జోయ్‌ సల్దానా, స్టీఫెన్‌ లాగ్, కాటే విన్‌స్లెట్, భారతీయ సంతతికి చెందిన దీలీప్‌ రావు తదితరులు ఇందులో నటిస్తున్నారు. సుమారు 12 సంవత్సరాల కిత్రం జేమ్స్‌కామెరాన్‌ దర్శకత్వంలో సామ్‌ వర్తింగ్‌స్టన్, జోయ్‌ సల్దానా, స్టీపెన్‌ లాంగ్‌లు కలిసి నటించిన ‘అవరతార్‌ చిత్రం అంతర్జాతీయంగా వసూళ్ల వర్షం కురిపించింది. 20 సెంచరీ ఫాక్స్, లైట్‌ స్ట్రోమ్‌ ఇంటర్నేషనల్‌ మరికొన్ని సంస్థలతో కలిసి నిర్మించిన ఈ సినిమాకి మౌరో ఫియార్‌ ఫోటోగ్రఫి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.