‘అవెంజర్స్‌ ఏంథమ్‌’ వచ్చేసింది..
హాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన సిరీస్‌గా ‘అవెంజర్స్‌’కు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్‌ నుంచి ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. వేసవి కానుకగా ఏప్రిల్‌ 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తాజాగా ‘మార్వెల్‌ ఏంథమ్‌’ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ ఈ పాటను కంపోజ్‌ చేశారు. ‘‘రొకే నా రుకెంగే అబ్‌తో యారా’’ అంటూ సూపర్‌ హీరోల మధ్య ఉన్న స్నేహాన్ని హైలెట్‌ చేస్తూ.. థానోస్‌ను అంతం చేయమని వారిలో స్ఫూర్తి రగిలించేలా ఈ గీతాన్ని కంపోజ్‌ చేశారు. ట్యూన్‌ కూడా చాలా క్యాచీగా ఉండటంతో.. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ల్‌ో టాప్‌-2 ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ గీతాన్ని విడుదల చేయనున్నారు. రెహమాన్‌ ప్రస్తుతం ఈ పనిలోనే బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకులు ఆంటోని రుస్సో, జాయ్‌ రుస్సో సంయుక్తంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని.. మార్వెల్‌ స్టూడియోస్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇది ఈ సిరీస్‌ నుంచి వస్తోన్న చివరి చిత్రం కావడంతో.. సినీప్రియుల్లో దీనిపై భారీ అంచనాలున్నాయి.
    
                             Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.