బ్యాట్‌మ్యాన్‌ హీరో రాబర్ట్ ప్యాటిన్సన్‌కి కరోనా.. ఆగిపోయిన చిత్రీకరణ

ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్‌ నటిస్తున్న చిత్రం ‘బ్యాట్‌మ్యాన్’‌. కరోనా వైరస్‌ కారణంగా చిత్రం షూటింగ్‌ ఆగిపోయిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ తరువాత చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. చిత్ర హీరో రాబర్ట్ ప్యాటిన్సన్‌కి కరోనా వైరస్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో మళ్లీ సినిమా చిత్రీకరణను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ ఏడాది ఆరంభంలో గ్లాస్గోలో సినిమా షూటింగ్‌ ఆరంభమైంది. కోవిడ్‌ -19 మహమ్మారి కారణంగా షూటింగ్‌ అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు మళ్లీ తిరిగి ఆరు నెలల అనంతరం షూటింగ్‌ లండన్‌ సమీప ప్రాంతంలో ప్రారంభమైంది. మ్యాట్ రీవ్స్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రాన్ని డీసీ ఫిల్మ్స్, 16 అండ్‌ ఇదాహో ప్రొడక్షన్స్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సినిమా జూన్‌ 2021లోనే విడుదల చేయాలనకున్నారు. కానీ పరిస్థితుల కారణంగా అక్టోబర్‌ 1, 2021న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మధ్యే సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. వార్నర్‌ బ్రదర్స్ పంపిణీదారుగా వ్యవహరిస్తున్న చిత్రంలో జాన్ టర్టురో, పీటర్ సర్స్‌గార్డ్, బారీ కియోఘన్, జేమే లాసన్, ఆండీ సెర్కిస్, కోలిన్ ఫారెల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. హీరో రాబర్ట్​ ప్యాటిన్సన్ 'టెనెట్', 'ద లైట్ హౌస్'​, 'వెయిటింగ్ ఫర్ ద బార్బేరియన్స్’ చిత్రాల్లోనూ కీలక పాత్రల్లో నటించారు.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.