కొత్త గబ్బిలం మనిషి దొరికేశాడు..

ట్విలైట్ సిరీస్​లో వ్యాంపైర్​గా మెప్పించిన హాలీవుడ్ నటుడు రాబర్ట్​ ప్యాటిన్సన్.. ఇప్పుడు బ్యాట్​మ్యాన్​గా అవతారమెత్తనున్నాడు. ఈ పాత్రకు సంబంధించి వార్నర్ బ్రదర్స్​ సంస్థతో తాజాగా ఒప్పందం చేసుకున్నాడట రాబర్ట్​. ఇప్పటివరకు 3 సినిమాల్లో బ్యాట్​మ్యాన్​ పాత్రను పోషించిన బెన్ అఫ్లెక్ ఇటీవలే ఈ సిరీస్‌ నుంచి తప్పుకోవడంతో కొత్తగా రాబర్ట్‌ను తీసుకున్నారు. ఈ సిరీస్‌లో రాబోతున్న కొత్త చిత్రానికి మ్యాట్​ రీవ్స్​ దర్శకత్వం వహించనున్నాడట. ఈ ఏడాది చివర్లో లేదా 2020 ప్రారంభంలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం రాబర్ట్‌.. క్రిస్టోఫర్ నోలాన్ తెరకెక్కిస్తున్న 'టెనెట్' చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు నెట్​ఫ్లిక్స్​ సంస్థలో 'ద లైట్ హౌస్'​, 'వెయిటింగ్ ఫర్ ద బార్బేరియన్స్' సినిమాల్లోనూ ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నాడు. దర్శకుడు మ్యాట్ రీవ్స్ ఇంతకముందు 'లెట్​ మీ ఇన్', 'డాన్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్'​, 'వార్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్' చిత్రాలను తెరకెక్కించారు.

Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.