బ్రాడ్‌పిట్‌తో ‘కిస్సింగ్‌ బూత్‌’ నటి జోయ్‌ కింగ్‌

హాలీవుడ్‌ నటుడు బ్రాడ్‌పిట్‌తో కలిసి హాలీవుడ్‌ యువనటి జోయ్‌ కింగ్‌ నటించనుంది. డేవిడ్‌ లీచ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బుల్లెట్‌ ట్రైన్‌’. యాక్షన్‌ అడ్వంచర్‌ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా కొటారా ఇసాకా రచించిన ప్రసిద్ద జపనీస్‌ పుస్తకం మరియ బీటిల్‌ ఆధారంగా వస్తోంది. చిత్రం అంతా హిట్‌మెన్‌ - హంతకుల మధ్య నడుస్తోంది. ఇందులో బ్రాడ్‌పిట్‌ హిట్‌మెన్‌ పాత్రలో నటించనున్నారు. ఇక నటి జోయ్‌ కింగ్‌ విషయానికొస్తే ఆమె రైలులో ప్రయాణించే యవతిగా కనిపించనుంది. జాల్క్‌ ఓల్కెవిచ్‌ కథను అందిస్తుండగా సోనీ పిక్చర్స్‌ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్రం షూటింగ్‌ ఈ ఏడాది చివర్లో సెట్స్‌ పైకి వెü™్ల అవకాశం ఉంది. ఇక నటి జోయ్‌ కింగ్‌ ఇప్పటికే అమెరికన్‌ రొమాంటిక్‌ కామెడీ చిత్రంగా తెరకెక్కిన ‘ది కిస్సింగ్‌ బూత్‌2’ చిత్రంలో నటించి అలరించింది. జులై 24 సినిమా నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా విడుదలైంది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘ది కిస్సింగ్‌ బూత్‌3’ సినిమా రూపొందిస్తున్నారు. విన్స్‌ మారెల్లో దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది నెటఫ్లిక్స్‌ ద్వారా తెరపైకి రానుంది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.