భయపెడుతున్న ‘బ్రైట్‌బర్న్‌’ బాలుడు

హాలీవుడ్‌ సూపర్‌ హర్రర్‌ చిత్రం ‘బ్రైట్‌బర్న్‌’ ఇండియాలో మే 29న తెరపైకి రానుంది. ఇప్పటికే ఈ చిత్రం మెక్సికో, హంగేరి విడులైంది. డేవిడ్‌ యెరోవిస్కై దర్శకత్వంలో రూపొందుతన్న సినిమాకి జేమ్స్‌ గన్, కెన్నెత్‌ హంగ్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నస్తున్నారు. చిత్ర కథలోకి వెళ్తే ఎన్నో సంవత్సరాలు పిల్లలు పుట్టక బాధపడుతున్న ఓ తల్లికి అనుకోకుండా ఓ రోజు ఆకాశం నుంచి ఓ ఉల్క రాలిపడుతుంది. అక్కడి వెళ్లిన దంపతులకు అక్కడో శక్తివంతమైన బాలుడు దొరుకుతాడు. ఆ బాబును తీసుకొచ్చి భార్యాభర్తలు అతన్ని ఎంతో గారాబంగా పెంచుతారు. బాబు స్కూల్లో చేరినప్పటి అతనితో కొంతమంది పిల్లలు గొడవపడతారు. దాంతో స్కూలు యాజమాన్యం పిల్లాడి తల్లితండ్రులను పిలిపిస్తారు. ఆ తరువాత తల్లితండ్రులు కూడా పిల్లాడి విషయంలో గొడవపడుతుంటారు. ఓ రోజు ఇంటి సమీపంలోని తోటలో తిరుగున్న వాహన చక్రాన్ని పట్టుకొని ఆపుతాడు. దాంతో తన శక్తిఎంటో తెలుస్తుంది. ఆ తరువాత తన సూపర్‌శక్తితో అతను ఏం చేశాడన్నది కథ. స్క్రీన్‌ జెమ్స్, స్జేటీ 6 ఫిల్మ్స్‌ పతాకంపై నిర్మితమౌతున్న ఈ సినిమాలో ఎలిజబెత్‌ బ్యాంక్స్, డేవిడ్‌ డెన్‌మ్యాన్,మాట్‌ జోన్స్‌ తదితరు నటిస్తున్నారు.

                                   


Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.