కరోనా దెబ్బకు కేన్స్‌ చిత్రోత్సవాలు వాయిదా!

ఎంతో అంగరంగా వైభవంగా జరపుకోనున్న 73వ కేన్స్‌ చిత్రోత్సవ వేడకల్ని కరోనా వైరస్‌ వల్ల వాయిదా వేస్తున్నట్టు చిత్రోత్సవ కమిటీ ప్రకటించింది. తొలుత ఈ కేన్స్‌ చిత్రోత్సవాల్ని మే 12- 23 మధ్య జరపాలని నిర్ణయించారు. ‘‘చిత్రోత్సవం జరపడానికి ఉన్న సురక్షిత మార్గాలన్నీ ఆలోచించాం. అందుకే వాయిదా వేస్తున్నాం. ఫ్రాన్స్‌లో ఆరోగ్య పరిస్థితులు కుదురుకున్నాకా కొత్త తేదీని ప్రకటిస్తాం’’ అని కేన్స్‌ ఫెస్టివల్‌ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. జూన్‌లో కానీ జులైలో కానీ కేన్స్‌ వేడుకలు జరిగే అవకాశం ఉంది.
Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.