అదరగొడుతున్న ‘చార్లిస్‌ ఏంజల్స్‌’ ట్రైలర్‌

ఎలిజబెత్‌ బ్యాంక్స్‌ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్, కామెడీ చిత్రం ‘చార్లిస్‌ ఎంజల్స్‌’. కొలంబియా పతాకంపై నిర్మితమౌతున్న ఈ చిత్రంలో క్రిస్టీన్‌ స్టీవార్ట్, నవోమి స్కాట్, ఎల్లా బాలిన్‌స్కా. ఎలిజబెత్‌ బ్యాంక్‌లాంటి అగ్ర నటీమణులు నటిస్తున్నారు. కథలోకి వెళ్లే చార్లిస్‌ ఎంజల్స్‌ అనే ప్రవేట్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వున్న తమ క్లైయింట్లకు అవసరమైన పనులు చేసిపెడతుంటారు. ముఖ్యంగా భద్రత, పరిశోధానాత్మక నైపుణ్యాల అంశాలతో మెరికల్లాంటి అమ్మాయిలకు ఇందులో శిక్షణ ఇస్తుంటారు. తమ వద్దకు వచ్చిన ఖాతాదారులకు పనులు చేస్తూ ఉంటారు. అంతర్జాతీయంగా ఎలాంటి విపత్తు వచ్చినా కష్టతరమైన పనులన్నింటిని ఈ మహిళా బృందం చక్కదిద్దుతూ ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌ ఒకటి విడుదలైంది. ట్రైలర్లో నవోమి స్కాట్, కిస్ట్రీన్‌ స్టీవార్ట్, ఎలిజబెత్‌ల సాహాసాలు ఆకట్టుకునేలా ఉన్నాయి.



Copyright 2019 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.