కరోనాకు భయపడిన క్రిస్‌ హెమ్స్‌వర్త్‌!

‘థోర్‌: రాగ్నరాక్‌’ చిత్రంలో ఎలాంటి వారినైనా ఎదిరించగల వీరుడి పాత్రలో హాలీవుడ్‌ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ నటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కరోనా వైరస్‌ కారణంగా ఇండియా పర్యటనను రద్దు చేసుకున్నాడు. త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోయో చిత్రం ‘ఎట్రాక్షన్‌’ ప్రచారం కోసం మార్చి 16న భారత్‌లో అడుగుపెట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడు కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా తీవ్రం కాడంతో చిత్రబృందం తన పర్యటనను రద్దు చేసుకుంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు గుజరాత్‌లో చిత్రీకరించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంగా తెరకెక్కతున్న ‘ఎట్రాక్షన్‌’ చిత్రానికి సామ్‌ హోర్గేవ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకా ఇందులో డేవిడ్‌ హార్బర్, ఇండియాకి చెందిన మనోజ్‌ బాజ్‌పేయి, రణ్‌దీప్‌ హుడా తదితర నటులు ఇందులో నటిస్తున్నారు. ఏప్రిల్‌ 20, 2020 తెరపెకి రానుంది.



Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.