వైరస్‌పై పోరాటం చేయనున్న జేమ్స్ బాండ్‌


ప్రముఖ హాలీవుడ్‌ నటుడు డేనియల్‌ క్రెయిగ్‌ నటిస్తున్న చిత్రం ‘నో టైమ్‌ టు డై’. ఇందులో జేమ్స్ బాండ్‌ (డేనియల్‌) ఓ పాపకు తండ్రి పాత్రలో కనిపించనున్నాడు. అంతేకాదు మరోకొత్త పాత్ర కూడా ఇందులో ఉండనుందని సమాచారం. ఇప్పటికే మానవాళిని పట్టిపీడిస్తున్న కోరానా వైరస్‌లాంటి వైరస్‌ నుంచి ప్రపంచాన్ని రక్షించే విధంగా కనిపించేనున్నాడట. కారీ జోజి ఫుకునాగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లియా సెడౌక్స్ డాక్టర్‌ మడేలిన్‌ స్వాన్‌ పాత్రలో నటిస్తుంది. ఇక ప్రతినాయకుడు సఫీన్‌గా రామి మాలెక్‌ నటిస్తున్నాడు. ఇయాన్ ప్రొడక్షన్స్, మెట్రో-గోల్డ్విన్-మేయర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా మైఖేల్ జి.విల్సన్, బార్బరా బ్రోకలీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన చిత్రం కోవిడ్‌-19తో వాయిదా పడింది. ప్రస్తుతం చిత్రంలో లాషనా లించ్, బెన్ విషా, నవోమి హారిస్, జెఫ్రీ రైట్, క్రిస్టోఫ్ వాల్ట్జ్, రాల్ఫ్ ఫియన్నెస్ తదితర నటులు నటిస్తున్నారు. సినిమాని ఈ ఏడాది నవంబర్‌ 12న యుకేలో, యుఎస్‌ఏలో నవంబర్‌ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియాలో నవంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మొత్తం మీద కరోనా వైరస్‌ సినిమా విడుదలతో పాటు, సినిమాలోనే తనతో సమానామైన వైరస్‌ పాత్రను కూడా చేర్చగలిగింది.Copyright 2020 USHODAYA ENTERPRISES PVT LTD, ALL RIGHTS RESERVED.
Powered by WinRace Technologies.